2018 మహానాడులో ప్రజల కష్టాలు గురుంచి చర్చించలేదు టీడీపీ – బీజేపీ డ్రామాలు ఆపండి – జి వి శ్రీరాజ్

రాజముండ్రి,

30th May 2018.

మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తనుయుడు జీవి శ్రీరాజ్ మళ్ళా టీడీపీ మహానాడు గురుంచి కామెంట్ చేసారు. 2017 లో విశాఖ లో జరిగిన మహానాడులో పని చేసిన యువ టీమ్ గురించి తీవ్ర స్థాయి లో స్పందించిన విషయం అందరికి తెలిసిందే, ఇందులో భాగంగ “టీడీపీ యూత్ వింగ్ ఒక పనికిరాని వింగ్ అని, 25 సంవత్సరాల చరిత్ర గల టీడీపీ పార్టీ లో నూతన ఉత్సాహంని నింపే విషయం లో విఫలం ఐంది, ఏమైనా అంటే కార్యకర్తలకు ప్లాట్లు పంచి పెట్టాం, ఎంగిలి ఆకులు ఎత్తం అని గొప్పలు పోయారేతప్పించి ఎటువంటి అభివృద్ధి చూపించలేకపోయారు” అని ఆయన ప్రస్తావించిన విషయం అందరికి తెలిసిందే.

ఐతే , 2018 మహానాడు గురించి శ్రీరాజ్ మళ్ళా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. “బీజేపీ-టీడీపీ చేసుకుంటునటువంటి ఆరోపణలలో ఆ రెండు పార్టీలకు భలం చేకూర్చే విధంగా ఉన్నాయ్ తప్పించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుంభకోణాల గురించి నోరు విప్పక పోవడం చాల విడ్డురంగా ఉంది” అన్నారు. ఏదైతే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి andhra అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబునాయుడు నీకు 10 రోజుల ముందు నోట్లరద్ధు గురించి ఎలా తెలుసు అని అడిగాడో దాని గురించి ఇప్పటివరకు ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వకపోవడం చాల బాధ్యతారహితం గ ఉంది అని అన్నారు.

2018 మహానాడు లో ఎక్కడ కూడా నోట్లరద్దు అంశం గాని పెరిగిన పెట్రోల్ ధరల గురించి గాని , రాష్ట్ర కేంద్ర ప్రభువత్వాల అవినీతి గురించి గాని మాట్లాడకపోవడం గమనార్హం. ఇదిఅంతా చూస్తుంటే టీడీపీ మరియు బీజేపీల గుంటనక్క వేషాలు ప్రజలందరికీ అర్ధం అవుతున్నాయి. ఏదైతే టీడీపీ మహానాడు బహుగొప్పగా జరిగింది అని గొప్పలుపోతున్నారో అదే ప్రజల ఇబ్బందులు ప్రస్తావించే విషయం లో విఫలం అయ్యారు అని శ్రీరాజ్ తెలిపారు.

అసెంబ్లీ సాక్షిగా “నువ్వు మోడీ కలిసి నోట్ల రద్దు అంశం లో ఏదైతే భారత దేశ ప్రజలని మోసం చేసారో ” అసల “చంద్రబాబు నీకు ప్రధాన మంత్రి నోట్ల రద్దు ప్రకటించక 10 రోజులు ముందే నీకు ఆ విష్యం ఎలాతెలుసు” అన్న విష్యం మీద ఇప్పటి వరుకు సమాధానం చెప్పగపోగా అప్పటి నుంచి బీజేపీ వాళ్ళు వైసీపీ ని వెనకేసుకొచ్చి దొంగదారిలో నోట్ల రద్దు అంశాన్ని తెరముందుకు రానివ్వకుండా వేషాలు వేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు అని అయన తెలిపారు.

Screen Shot 2018-05-30 at 3.12.20 PM.png

Author: Rajahmundry Times Press

Nothing Just News

Leave a comment